తిరుమలకు పాదయాత్ర

తొండూరు: వైయస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల కావాలని కోరుతూ ఇనగలూరు గ్రామస్తులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. గురువారం వైయస్‌ఆర్‌సీపీ తాలుకా కార్యదర్శి దశరథరామిరెడ్డి ఆధ్వర్యంలో దాదాపు 30మంది ఇనగలూరు నుంచి తిరుమలకు బయలుదేరారు. వైయస్‌ఆర్‌సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు వైయస్ అవినాష్‌రెడ్డి ఈ పాదయాత్రను ప్రారంభించారు. ముందుగా ఎరుకుల నాంచారమ్మ దేవాలయంలో పూజలు చేసి బస్టాఫ్ వద్దనున్న వై ఎస్ విగ్రహానికి పూలమాలవేసి బయలుదేరారు. కార్యక్రమంలో వైయస్‌ఆర్‌సీపీ నాయకులు బండి రామమునిరెడ్డి, రమణారెడ్డి, శివశంకర్‌రెడ్డి, గంగయ్య, వెంకట్రామిరెడ్డి, ప్రకాష్‌రావు, కొవ్వూ రు గంగిరెడ్డి, అరుణ్‌కాంత్‌రెడ్డి,పెద్ద ఎరికలరెడ్డి పాల్గొన్నారు.

Back to Top