వైయస్‌ఆర్‌సీపీలోకి 1000 మంది టీడీపీ, కాంగ్రెస్‌ కార్యకర్తలు చేరిక

విశాఖపట్నంః విశాఖ ఏజెన్సీలో వైయస్‌ఆర్‌సీపీ ప్రభంజనం సాగుతోంది.పెద్దఎత్తున్న ఇతర పార్టీ నాయకులు,కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారు.తాజాగా అరకు మండలం కోడిపుంజుల వలసలో మాజీ ఎమ్మెల్యే కుంబా రవిబాబు ఆధ్వర్యంలో సుమారు 1000 మందికిపైగా టీడీపీ,కాంగ్రెస్‌ కార్యకర్తలు వైయస్‌ఆర్‌సీపీలోకి చేరారు. కోడిపుంజువలసలో కావాలి జగన్‌–రావాలి జగన్‌ కార్యక్రమంలో దివంగత మహానేత వైయస్‌ఆర్‌ విగ్రహాన్ని రవిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ  కోడిపుంజువలసలో కొండ చరియలు విరిగి 19 మంది మృతి చెందినప్పుడు సీఎంగా వైయస్‌ఆర్‌ చేసిన సాయం గిరిజనులు మరిచిపోలేరన్నారు. ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారన్నారు. విశ్వాసంతో ఆదివాసీలు వైయస్‌ జగన్‌ వెంట నడుస్తున్నారన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి కోడిపుంజు వలస గ్రామాన్ని  మెరక ప్రాంతంలో  పునర్మిర్మాణం చేశారన్నారు. మన రాష్ట్రానికి స్వర్ణయుగం రావాలంటే వైయస్‌ జగన్‌ సీఎం కావాలన్నారు.
 
Back to Top