వేల కోట్ల స్కామ్‌

హైదరాబాద్: స‌దావ‌ర్తి స‌త్రం భూముల విష‌యంలో వేల కోట్ల రూపాయల కుంభ‌కోణం జ‌రిగింద‌ని వైయ‌స్ఆర్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. హైద‌రాబాద్ లోట‌స్ పాండ్ లోని పార్టీ కేంద్ర కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఆ ప్రాంతంలో  పరిశీలించేందుకు వెళ్లిన వైయ‌స్ఆర్ సీపీ నిజానిర్ధారణ కమిటీని అమరావతిలో టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని చెప్పారు. అమరలింగేశ్వరస్వామి భూముల కుంభకోణంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఆయన కొడుకు లోకేష్కు సంబంధం ఉంది కాబట్టే అడ్డుకున్నారని విమర్శించారు.

ఈ నెల 26న చెన్నైలో ధర్మాన ప్రసాదరావు బృందం పర్యటించి, సదావర్తి సత్రం భూములపై వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని రాంబాబు చెప్పారు. అన్యాయాలను ప్రజలకు వివరించేందుకు వైఎస్ఆర్ సీపీ ప్రయత్నిస్తుంటే, అడ్డుకునేందుకు చంద్రబాబు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నాయకులు దొంగలు కాబట్టే భయపడుతున్నారన్నారు.
 

Back to Top