రాజ‌ధాని పేరుతో వేల కోట్ల దోపిడీ

చిత్తూరు) ఏపీ రాజ‌ధాని పేరుతో వేల కోట్ల రూపాయిల మేర దోపిడీ జ‌రుగుతోంద‌ని వైయ‌స్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి మండిప‌డ్డారు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ప్ర‌జ‌ల దృష్టిని మళ్లించేందుకు చంద్ర‌బాబు ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేల‌ను లాక్కొంటూ డ్రామాలు న‌డిపిస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. అవినీతి సొమ్ముతో పెద్ద ఎత్తున కొనుగోళ్ల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆయ‌న పేర్కొన్నారు. చిత్త‌శుద్ది ఉంటే పార్టీ మారిన నాయ‌కుల‌తో రాజీనామాలు చేయించాల‌ని కోరారు. ఎన్నిక‌ల‌కు వెళ్లే స‌త్తా లేక‌నే చంద్ర‌బాబు నోరు మెద‌ప‌డం లేద‌ని ఆయ‌న అభిప్రాయ పడ్డారు. ఈ పోక‌డల్ని ప్ర‌జ‌లు గ‌మనిస్తున్నార‌ని మిథున్ రెడ్డి పేర్కొన్నారు. స‌రైన స‌మ‌యంలో ప్ర‌జ‌లే చంద్ర‌బాబుకి బుద్ది చెబుతార‌ని ఆయ‌న అన్నారు. 
Back to Top