ఆ ముగ్గురు ఏపీ ప్రజలను వంచించారు..

ఢిల్లీః గత ఎన్నికల సమయంలో మోదీ,చంద్రబాబు,పవన్‌కల్యాణ్‌లు  ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను వంచించారని వైయస్‌ఆర్‌సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు.ఢిల్లీలో  వంచనపై గర్జన నిరసన కార్యక్రమంలో మాట్లాడారు. నేడు ముగ్గురు ఎవరిదారిన వారు విడిపోయి ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటూ ఏపీ ప్రజలను నడిరోడ్డు మీద వదిలేశారని మండిపడ్డారు. ఏపీ విభజన చట్టాన్ని అమలు చేయని పార్టీ ఒకటయితే, విడగొట్టిన పార్టీ మరోకటి అన్నారు. ఈ రెండు పార్టీలతో ఏపీకి ఏ మాత్రం ఉపయోగం లేదన్నారు. ఢిల్లీ అంటే చంద్రబాబుకు, వారి ఎంపీలకు భయం తప్ప.. వైయస్‌ఆర్‌సీపీకి భయంలేదన్నారు. వైయస్‌యర్‌సీపీ అజెండా ఏపీకి ప్రత్యేకహోదా తీసుకురావడమే అని అన్నారు. ప్రత్యేకహోదాను తీసుకురావడంలో చేతులేత్తిసిన చంద్రబాబు నేడు కొత్త డ్రామాకు తెరతీశారని దుయ్యబట్టారు..ఇటలీ కాంగ్రెస్, ఇటలీ భూతం, రాహుల్‌ మొద్దుబ్బాయ్‌ అని మాట్లాడిన చంద్రబాబు మళ్లీ వాళ్ళతో చేతులు కలిసి మళ్లీ ఏపీ ప్రజలను మరోసారి మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారన్నారు. లోక్‌సభలో ప్రభుత్వంపై అవిశ్వాసం తీర్మానం పెట్టిన మొట్టమొదటి పార్టీ వైయస్‌ఆర్‌సీపీ అని అన్నారు.
Back to Top