అందరికీ ధన్యవాదాలు: సలామ్ బాబు

నెల్లూరు)) యువభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన
వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వైయస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు
సలామ్ బాబు పేర్కొన్నారు. నెల్లూరు నగరంలో పార్టీ నెల్లూరు జిల్లా యువజన విభాగం
అధ్యక్షులు రూప్ కుమార్ యాదవ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ప్రసన్న శ్రవణ్
కుమార్ లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ
అధ్యక్షులు వైయస్ జగన్ ఏర్పాటు చేసిన యువభేరి కార్యక్రమానికి పెద్ద ఎత్తున
విద్యార్థులు, యువత తరలి వచ్చిన సంగతి తెలిసిందే. కార్యక్రమానికి విచ్చేసిన
వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. అలాగే కార్యక్రమ ఏర్పాట్లలో సహకరించిన నాయకులు,
ఇతర పార్టీ పెద్దలకు ధన్యవాదాలు తెలియచేశారు.

 

Back to Top