ఇదొక గెలుపా.. సిగ్గుందా చంద్రబాబూ

శ్రీకాకుళం: నంద్యాల ఉప ఎన్నికల్లో నీచాతి నీచమైన బతుకుతో గెలిచిన నీది ఒక గెలుపేనా చంద్రబాబు అని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హైపర్‌ కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం విమర్శించారు. ఒక రాష్ట్ర ఎన్నికలకు సరిపడా ఖర్చును నంద్యాలలో పెట్టావు చంద్రబాబు.. ఇదొక గెలుపా.. నీకు సిగ్గుందా అని ధ్వజమెత్తారు. నంద్యాలలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీదే నైతిక గెలుపన్నారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాలలో ప్రచారానికి వచ్చారు కాబట్టే టీడీపీ కేబినెట్‌ అంతా అక్కడకు చేరిందన్నారు. ఓటర్లను భయబ్రాంతులకు గురిచేసిందన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు వారు తీర్పును స్వచ్ఛందంగా వెల్లడిస్తారని, నిజంగా చంద్రబాబు తన అభివృద్ధి వల్లే గెలిచాననుకుంటే 20 మంది ఫిరాయింపుదారులతో రాజీనామా చేయించి ఎన్నికలకు రావాలని సవాలు విసిరారు. 

Back to Top