తెలంగాణపై బిఎసిలో చర్చిద్దాం: విజయమ్మ

హైదరాబాద్‌, 18 సెప్టెంబర్‌ 2012: తెలంగాణతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా అనేక సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్ఆ‌ర్ కాంగ్రె‌స్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వై‌యస్ విజయమ్మ అసెంబ్లీలో ‌ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సమస్యపై అన్ని పార్టీలు కలిసి బీఏసీలో చర్చించి పరిష్కరించవచ్చని అన్నారు. అసెంబ్లీలో ఎలాంటి తీర్మానం చేస్తారంటూ అన్ని ప్రాంతాల ప్రజలు ఎదురు చూస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ సమయం లేనందున, ఇప్పటికే ఒకరోజు ముగిసిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై అన్ని పార్టీల సభ్యులూ స్పందించి నిర్ణయం తీసుకుంటే మంచిదని విజయమ్మ సూచించారు.

Back to Top