ప్రాజెక్ట్ లలో టీడీపీ విచ్చలవిడి అవినీతి

అమరావతిః  రెండవ రోజు  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.  ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ఈ సందర్భంగా వైయస్సార్సీపీ సభ్యులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం చెప్పలేక దాటవేత ధోరణి కొనసాగిస్తుంది. 

  • ఏపీలో ఎందుకు గ్రేడింగ్‌ తగ్గింది
  • మేకపాటి గౌతం రెడ్డి
ట్రాన్స్‌మిషన్, డిస్‌మిషన్‌ తగ్గించామని మంత్రి చెబుతున్నారు. గ్రేడింగ్‌ తగ్గించినప్పుడు ఎందుకు బీ ఫ్లస్‌ నుంచి బీకి ఎందుకు తగ్గింది. కేవలం ఎనర్జి ఎఫిసియెన్స్‌  మాత్రమే తగ్గించారు. తెలంగాణలో ఏ, ఏ ఫ్లస్‌ గ్రేడింగ్‌ ఉంది. ఏపీలో బీ ఫ్లస్‌ నుంచి బీకి తగ్గింది. వీళ్లు ఏవిధంగా మంచి పని చేశారో అర్థం కావడం లేదు.
–––––––––––––
ప్రాజెక్టులపై టీడీపీకి చిత్తశుద్ధి లేదు
శ్రీకాంత్‌రెడ్డి
గాలేరు–నగరి ప్రాజెక్టు రాయలసీమకు ఒక వరప్రసాదం లాంటిది. గ్రావిటీతో నీళ్లు ఇవ్వగల ప్రాజెక్టు ఇది. మొత్తం కర్నూలు జిల్లాలో ప్రారంభమై కడప, చిత్తూరు వరకు ఉంటుంది. లక్షలాది ఎకరాలకు ఆయకట్టుగా ఉపయోగపడుతోంది. బాబు 1999 నుంచి 2004 వరకు సీఎంగా ఉన్న సమయంలో ఈ ప్రాజెక్టకు కేవలం రూ.17 కోట్లే. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనలో ఈ ప్రాజెక్టు వ్యయాన్ని మొదటి, రెండు ఫేస్‌లో రూ.7500 కోట్ల నిర్ధారించి మొదటిగా తాను రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టారు. ఆ తరువాత ముఖ్యమంత్రులు రోషయ్య, కిరణ్‌ కుమార్‌రెడ్డిలు రూ. వెయ్యి కోట్లు ఖర్చు చేశారు. ఈ మూడేళ్లలో వీరు రూ.400 కోట్లు ఖర్చు చేసి మొత్తం ప్రాజెక్టు అంతా కట్టేశామని చెప్పుకుంటున్నారు. వివరాలు అన్నీ కూడా చూస్తే..29వ ప్యాకే జ్‌ అవుకు టన్నల్‌కు పని చేయకుండానే రూ.36 కోట్ల పనికి రూ.200 కోట్లకు అంచనాలు పెం చి టెండర్లు వేయకుండానే పనులు అప్పగించారు. అదేవిధంగా మిగిలిన ప్రతి ప్యాకేజీలో వైయస్‌ఆర్‌ హయాంలో 80 శాతం పూరై్తన ప్రాజెక్టులను రూ.10 కోట్లు, 15 కోట్లతో పూర్తి చేయాల్సిన ప్రాజెక్టకు వివరీతమైన అంచనాలు పెంచి దోపిడీ మార్గానికి తెర లేపారు. ప్రాజెక్టులపైనా చిత్తశుద్ధి లేదు. ఫేస్‌–2పైనా ఇంతవరకు దృష్టిపెట్టలేదు. కాంట్రాక్టర్లను బెదిరించి మేం ఎస్కలేషన్‌ చేసుకోవాలని క్యానల్ చేయించారు. 29వ ప్యాకేజ్‌ ప్రాజెక్టుపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. ఈ ఒక్క ప్యాకేజీలోనే టీడీపీ నేతలు చేసిన  అవినీతి బయటపడుతోంది. ఇది చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. దీనికి రూపకల్పన పోతిరెడ్డిపాడు. దాన్ని 56 వేల క్యూసెక్కులకు పెంచింది  మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి. పొతిరెడ్డిపాడు నుంచి బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌కు వచ్చి అక్కడి నుంచి గోరుకల్లు రిజర్వాయర్‌ చేరుకొని అవుకు ద్వారా నీరు గండికోట ప్రాజెక్టుకు వస్తుంది. గండికోట నుంచి వాయికోండ, సర్వరాయసాగర్, బాలాజీ రిజర్వాయర్‌ వరకు వెళ్తుంది. ఈ ప్రాజెక్టుకు ఎందుకు పూర్తి చేయడం లేదు. అవినీతి చేసి దీనిపై దృష్టిపెట్టడం లేదు. గోరుకల్లు నుంచి కూడా నీరు ఇవ్వడం లేదు. అవుకు టన్నల్‌ నుంచి నీళ్లు ఇవ్వడం లేదు. ఎందుకు చిత్తశుద్దితో చేయడం లేదు. 
Back to Top