టీడీపీ కుప్పకూలడం ఖాయం

విశాఖపట్నం: కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంను ఏకాకిని చేస్తే చూస్తూ ఊరుకోమని కాపు నేతలు  కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్ లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దమ్ముంటే టీడీపీ కాపు నేతలు రాజీనామా చేసి ఉద్యమంలోకి రావాలన్నారు. విశాఖలో వీజేఎఫ్లో జిల్లా, నగర కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటివరకూ చర్చలకు రాకపోవడం శోచనీయమని అన్నారు.

చంద్రబాబు నాయుడు నిర్ణయాలు పరాకాష్టకు చేరుతున్నాయని ధ్వజమెత్తారు. మీడియాపై ఆంక్షలు విధించడం దుర్మార్గమని విమర్శించారు. కాపులు ఉద్యమిస్తారనే భయంతో టీడీపీ నేతలు ప్రతిపక్షంపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. కాపు ఉద్యమాన్ని అణిచివేయాలని చూస్తే టీడీపీ ప్రభుత్వం కూలిపోతుందని హెచ్చరించారు.

Back to Top