వైయస్సార్సీపీలో చేరిన టీడీపీ ఎంపీటీసీ

వైయస్ఆర్ కడప కార్పొరేషన్‌: జిల్లాలోని వీరబల్లి మండలం గడికోటకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎంపీటీసీ సీ. మోహన్‌ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు.  ఓ ప్రైవేటు అతిథిగృహంలో మాజీ మంత్రి వైయస్‌ వివేకానందరెడ్డి సమక్షంలో ఆయన వైయస్‌ఆర్‌సీపీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ విధానాలు నచ్చక తాను వైయస్‌ఆర్‌సీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో ఎవరి బలవంతమూ లేదన్నారు. దివంగత వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి, ఆయన తమ్ముడు వైయస్‌ వివేకానందరెడ్డిపై ఉన్న అభిమానంతోనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో రాయచోటి మాజీ ఎంపీపీ సుబ్బారెడ్డి, రామాపురం మాజీ జెడ్పీటీసీ నాగసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top