తెలుగుదేశం పార్టీకి సమాధి కట్టడం ఖాయం

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మేలు జరగాలంటే ప్రజలకున్న ఏకైక మార్గం వైయస్‌ జగన్‌ ఒక్కరేనని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ కార్యదర్శి రెహ్మాన్‌ అన్నారు. మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు ముస్లింలకు మేలు చేయాలనే ఆలోచన చేయలేదని మండిపడ్డారు. ముస్లింలను చంద్రబాబు కరివేపాకులా వాడుకుంటున్నారన్నారు. ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డికే దక్కిందన్నారు. వైయస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితే ముస్లింలకు ఇంకా మేలు జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని 200 కిలోమీటర్ల దూరంలో సమాధి కట్టడం ఖాయమన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top