శ్రీకాకుళం: అధికార మదంతో తెలుగు తమ్ముళ్ల కళ్లు నెత్తికెక్కాయి. బరితెగించి భారత జాతీయ జెండా స్థూపాన్ని పెకిలించి అవమానించారు. ఈసంఘటన శ్రీకాకుళం జిల్లా అంధవరం పంచాయతీ రామకృష్ణాపురంలో జరిగింది. జనచైతన్య యాత్రలో టీడీపీ నేతలు మితిమీరి ప్రవర్తించారు. ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉన్న జాతీయ జెండా స్థూపాన్ని పెకలించి గ్రామం మధ్యలో పెట్టి పసుపు రంగు వేసి టీడీపీ జెండా కట్టి పండగ చేసుకున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ...అప్పటికప్పుడు, పాఠశాల ముందు తాత్కాలికంగా స్థూపం కోసం సిమెంటు దిమ్మకట్టి చేతులు దులుపుకున్నారు. దీనిపై హెచ్‌ఎం పి.రామకృష్ణను సంప్రదించగా, జాతీయ జెండా స్థూపాన్ని తొలగించడం నేరమని చెప్పారు. దీన్ని తొలగిస్తామని తనకు ముందుగా ఫోన్ చేయగా వ్యతిరేకించానని, ఆదివారం పాఠశాలకు సెలవు కావడంతో పెకలించి వేశారని చెప్పారు. దీనిపై కలెక్టరుకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీపీ, జెడ్పీటీసీ ప్రతినిధులు కొయ్యాన సూర్యారావు, మెండ రాంబాబుతోపాటు మరికొందరు గ్రామస్తులు తెలిపారు.<br/>