టీడీపీ నేత‌లు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌


అనంత‌పురం : తెలుగుదేశం పార్టీ నుంచి వందమందికి పైగా కార్యకర్తలు వైయ‌స్ఆర్‌సీపీ లోకి చేరారు. బొమ్మనహాళ్‌లో  ఏర్పా టు చేసిన బూత్‌ లెవల్‌ సభ్యుల సమావేశంలో దేవగిరి గ్రామానికి చెందిన ఎంసీహెచ్‌ రాజ్‌కుమార్‌ ఆధ్వర్యంలో రామాంజి, మద్దనీ, ఎర్రిస్వామి, రాము, వెంకటేష్, ఎర్రిస్వామి తదితరులకు వైయ‌స్ఆర్‌ సీపీ జిల్లా పరిశీలకులు వైయ‌స్‌ కొండారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిలు కడువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. వైయ‌స్ఆర్‌సీపీ మండల కన్వీనర్‌ ఈశ్వరరెడ్డి, నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, సత్యన్న, యోగేశ్వరరెడ్డి, ఎంపీటీసీలు జయరామ్‌రెడ్డి, పరమేశ్వర, ఎల్‌.లోకేష్‌ , ప్రతాప్‌రెడ్డి, బసప్ప, మల్లారెడ్డి, సర్మస్, ఆనంద్, లక్ష్మినారాయణ, తిప్పేస్వామి, కొత్తూరు తిమ్మప్ప, తిప్పేస్వామి, వన్నూరుస్వామి, కృష్ణ, సంగప్ప, దర్గాహొన్నూరు పాల్గొన్నారు.


తాజా ఫోటోలు

Back to Top