వైయస్సార్సీపీలోకి టీడీపీ నాయకులు

వైయస్సార్ కడపః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. బాబు మోసపూరిత విధానాలు, అవినీతి అక్రమ పాలనతో విసుగు చెందిన టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా ఆ పార్టీని వీడుతున్నారు.  వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పోరాటాలకు ఆకర్షితులవుతున్నారు. జననేత నాయకత్వంలో పనిచేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. మాజీ ఎంఎల్ఏ గడికోట మోహన్ రెడ్డి సమక్ష౦లో గాలివీడు మండలం నూలివీడు గ్రామం బోడశాని పల్లె కు చెందిన వార్డు సభ్యుడు వేదమూర్తి రెడ్డి సహా మరికొన్ని కుటుంబాలు టిడిపిని వీడి వైయస్సార్సీపీలో చేరారు. మోహన్ రెడ్డి వీరందరికీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top