విజయనగరం: గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ పార్టీని వీడి వైయస్ఆర్‌సీపీలో చేరారు. జిల్లాలో జరుగుతున్న ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా సాలూరు నియోజకవర్గంలోని సాలూరు మండలంలో గల తాడిలోవ సమీపంలో పార్టీ అధినేత వైయస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వారు పార్టీలో చేరారు.<br/>గుంటూరు జిల్లా ఇన్‌చార్జి, సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ నేతృత్వంలో చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరం మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ వలేటి హిమంతరావు, పెంటేల శ్రీనివాసరావు, మేకపాట నాగభూషణరావులు తెలుగుదేశం పార్టీను వీడి వైయస్ఆర్‌సీపీలోకి వచ్చారు. వీరికి వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువాలు వేశారు. కార్యక్రమంలో చిలకలూరిపేట నియోజకవర్గ నాయకులు విడదల గోపి, కోటిరెడ్డి, ఉపేంద్ర, కమలేంద్ర తదితరులు పాల్గొన్నారు.<br/><br/>