వైయస్సార్‌ కాంగ్రెస్ పార్టీ వాడినని వేధిస్తున్నారు

మాట్లాం (కృత్తివెన్ను) : వైయస్సార్‌కాంగ్రెస్‌పార్టీకి చెందిన వాడిని కావడంతోనే తనపై కక్ష పూని అధికార పార్టీ వారు వేధింపులకు పాల్పడుతున్నారని మాట్లాం గ్రామానికి చెందిన రామాని వెంకట్రాజు వాపోయాడు. ఇటీవల తన కుమారుడైన సత్యనారాయణపై గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వారు అకారణంగా దాడిచేసి గాయపరిచినట్లు తెలిపారు. పంచాయతీ నిధులతో నిర్మించిన రోడ్డుపై గ్రామ ప్రజలను నడవనీయకుండా అడ్డు పడుతూ దౌర్జన్యం చేస్తున్నట్లు వాపోయాడు. తన కుమారుడు రోడ్డు వెంబడి బైక్‌పై వెళుతుండగా దారి కాచి దాడిచేసి తీవ్రంగా గాయపరిచినట్లు తెలిపారు. ప్రస్తుతం తన కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపాడు. తమ కుటుంబం ఎన్నికల సమయంలో వైయస్సార్‌సీపీకి మద్దతు ఇచ్చిందన్న కక్షతో అధికార పార్టీకి చెందిన వారు వేధింపులకు పాల్పడటమే కాకుండా గ్రామంలో ప్రభుత్వ రహదారి సైతం తమదంటూ దౌర్జన్యం చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దాడి ఘటనపై ఫిర్యాదు చేశామని అధికారులు తమకు న్యాయం చేయాలంటూ కోరుతున్నాడు. దీనిపై సంబంధిత పంచాయతీ సర్పంచ్‌ను వివరణ కోరగా రహదారిని కొంత ఎంపీ గ్రాంటు, మరికొంత ఉపాధి హామీ నిధులతో నిర్మించామని తెలిపారు.
ఫొటోలు..

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top