నీటి సమస్యను సృష్టిస్తున్న టీడీపీ నాయకులు

మదనమోహనపురం (నందలూరు): మండలంలోని టంగుటూరు పంచాయితీలోని చింతకాయపల్లె గ్రామానికి చెందిన టీడీపీ నేతలు మదనమోహనపురానికి తాగునీటిని అందకుండా సమస్యను సృష్టిస్తున్నారని వైయస్సార్‌సీపీ బీసీనేత మండల నాయకుడు చుక్కా వెంకటేష్‌ పేర్కొన్నారు ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ... చింతకాయపల్లె టీడీపీనేతలు తాగునీటిని కొత్తగా నిర్మిస్తున్న ఇంటి నిర్మాణాలతోపాటు ఇటుకలబట్టీలకు, మామిడితోటలకు  వాడుకోవడంవల్ల తమ గ్రామానికి తాగునీటి సమస్య ఏర్పడిందన్నారు. ఈ విషయం గురించి ప్రశ్నిస్తే తమ ఇష్టంవచ్చినట్లు వాడుకుంటామంటున్నారని మండిపడ్డారు. నీటి సమస్యను ఎంపీడీఓ, ఆర్‌డబ్లుయస్‌ఏఈ దృష్టికి తీసుకెళతామని అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అందోళన చేపడుతామని హెచ్చరించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top