హైదరాబాద్ : కాల్ మనీ వ్యవహారంలో పోలీసులను టీడీపీ నేతలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత సామినేని ఉదయభాను ఆరోపించారు. కృష్ణాజిల్లాలో కాల్మనీ వ్యవహారంపై స్పందించిన ఉదయభాను ... ఈ వ్యవహారంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ సహా పలువురు టీడీపీ నేతల హస్తముందన్నారు.<br/>చంద్రబాబు పర్యటనల్లో కాల్మనీ సూత్రధారులదే హడావుడి అని ఆయన చెప్పారు. పేదల రక్తం తాగుతున్న కాల్మనీ నిందితులను ఉరి తీసినా తప్పు లేదని ఉదయభాను అభిప్రాయపడ్డారు. ఈ వ్యవహారంపై నోరు విప్పాలని ముఖ్యమంత్రి చంద్రబాబును సామినేని ఉదయభాను డిమాండ్ చేశారు.