టీడీపీ గూండాల దాడి

పశ్చిమగోదావరిః  జిల్లాలోని
ఉండ్రాజువారిపాలెం మారుతి గ్రామంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు భయానక
వాతావరణం సృష్టించారు. వైఎస్సార్సీపీ స్థానిక సొసైటీ ప్రెసిడెంట్ నరేంద్ర
ఇంటిపై కత్తులు, కర్రలతో దాడులకు తెగబడ్డారు. ఇంటిచుట్టూ దారులన్నీ మూసేసి
నరేంద్ర, ఆయన కుటుంబసభ్యులపై 200 మంది టీడీపీ గుండాలు విచక్షణారహితంగా
కొట్టారు. నరేంద్ర, ఆయన తండ్రి తల, కాళ్లు చేతులు విరగ్గొట్టారు. నరేంద్ర
ఇంటిపై పచ్చనేతలు చేసిన దాడిని వైఎస్సార్సీపీ పూర్తిగా ఖండించింది.
వైఎస్సార్సీపీ నేతలు, నాయకులు, కార్యకర్తల ప్రాణాలకు రాష్ట్రంలో రక్షణ
లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది.

వైఎస్సార్సీపీ
ఎమ్మెల్సీ మేక శేషుబాబు టీడీపీ నేతల దాదాగిరిపై మండిపడ్డారు. నరేంద్ర, ఆయన
కుటుంబసభ్యులపై దాడి చేసి భయపెట్టడం దుర్మార్గమన్నారు. టీడీపీ నేతల ఇసుక
దందాలు, దోపిడీలు, అరాచక కార్యక్రమాలను ప్రశ్నించినందుకు దాడులకు తెగబడడం
బాధాకరమన్నారు.  గతంలో ఎన్నో ప్రభుత్వాలు పరిపాలించాయని, ఇలాంటి సంఘటనలు
ఎన్నడూ జరగలేదన్నారు.  దోషులను అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని
డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చూడాలని పోలీసులను
హెచ్చరించారు. 
Back to Top