టీడీపీది గూండా వ్య‌వ‌స్థ‌

రామచంద్రపురం: రాష్ట్రంలో పోలీసులను టీడీపీ గూండా వ్యవస్థగా మార్చేశారని, చంద్రబాబునాయుడు పాలనను అంతమొందించేందుకు ప్రజలు సమయం కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు పేర్కొన్నారు. రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం పార్టీ పట్టణ కన్వీనర్ గాదంశెట్టి శ్రీధర్ అధ్యక్షతన జరిగింది.

ముఖ్య అతిథిగా హాజరైన పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ అసాధ్యమైన హామీలను గుప్పించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజల వద్ద ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అధికారాన్ని జన్మభూమి కమిటీలకు అప్పగించి ఇష్టారాజ్యంగా పాలిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్ర బోసు మాట్లాడుతూ రుణమాఫీ పేరుతో చంద్రబాబు నాయుడు రైతులను నట్టేట ముంచేశాడన్నారు.

అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్షం గొంతు నొక్కుతున్న తీరును ప్రజలకు తెలియజేయాలని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు సూచించారు. రాష్ట్రంలో దోపిడీ పాలనకు చరమగీతం పాడాలని పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి పిలుపునిచ్చారు. తాను పార్టీ మారిపోతున్నానంటూ అధికారపారీవారు దుష్ర్పచారం చేశారని రంపచోడవ రం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. తాను పార్టీ మారితే  పదవులు, రూ.కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారన్నారు. తాను ఎన్నటికీ పార్టీ మారబోనని స్పష్టం చేశారు.

Back to Top