అనంతపురం(సంబేపల్లె): అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల భావ ప్రకటన స్వేచ్ఛను కాలరాస్తోందని మండల వైయస్‌ఆర్‌సీపి కన్వీనర్ ఉదయ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. శాసనసభలో అధికార పార్టీ సభ్యులు ప్రతి పక్ష సభ్యుల వాణిని అడ్డుకొన్న తీరును చూస్తే.. అధికార పార్టీకి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విధులు తెలియదేమోనన్న అనుమానం కలుగుతోందన్నారు. ప్రభుత్వమే రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంటే ఇక వారు చేసే చట్టాలకు ఏం విలువ ఉంటుందని నిలదీశారు. చట్ట సభలలో ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు ఇస్తున్న వివరణను తీసుకొని అందుకు తగిన విధంగా స్పందించాలే తప్ప, అధికార బలంతో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను చులకనగా చూడడం శ్రేయస్కరం కాదన్నారు.<br/>