వైయస్ జగన్ నాయకత్వంలోనే అభివృద్ధివైయస్ఆర్సీసీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి
విజయనగరంః విజయనగరం జిల్లా సమస్యల వలయంలో ఉందని వైయస్‌ఆర్‌సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. జిల్లాలో రెండు జ్యూట్ మిల్లులు మూడు సంవత్సరాల క్రితం మూతపడ్డాయన్నారు.వేలాది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. గత సంవత్సరం చంద్రబాబు నాయుడు ఈ జిల్లా పర్యటనలో భాగంగా నెలరోజుల్లో మిల్లును తెరిపిస్తానని హామీ ఇచ్చారని, సంవత్సరం పూర్తికావొస్తున్న తెరిపించలేదన్నారు. కనీసం చర్చలు కూడా జరపలేదన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు విజయనగరం జిల్లాలో అధికంగా ఉన్నారని వారికి న్యాయం చేయకుండా ప్రభుత్వం జాప్యం చేస్తుందన్నారు. జిల్లాలో చేయడానికి పనిలేదు.. తినడానికి తిండిలేదన్న పరిస్థితి వుందన్నారు. జిల్లాలో వలసలు అరికట్టి ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రజలు డెంగ్యూ,విషజ్వరాలతో మరణిస్తున్న కూడా ప్రభుత్వం నిర్లక్ష్యధోరణితో వ్యవహరిస్తుందన్నారు. దోమలపై దండయాత్రపై నిధులు కేటాయించారని ఆ నిధులను ప్రజాప్రతినిధులు, అధికారులు కైకర్యం చేశారు తప్ప..కనీస నివారణ చర్యలు తీసుకోలేదన్నారు. విజయనగరం పట్టణంలో కనీస ప్రభుత్వ డిగ్రీ కళాశాల కూడాలేని దుస్థితి ఉందన్నారు. విద్య,వైద్య రంగాల్లో జిల్లాని పూర్తిగా గాలికి వదిలివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకు ఇచ్చిన హామీలను చంద్రబాబు నాయుడు ఒకసారి గుర్తుతెచ్చుకోవాలని, జిల్లాకు వచ్చి ఓటు అడిగే అర్హత లేదని దుయ్యబట్టారు.. జిల్లా అభివృద్ధి వైయస్ జగన్‌తోనే సాధ్యమవుతుందన్నారు. జగన్ నాయకత్వం కోసం జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారని తెలిపారు.