అంగన్ వాడీలపై పచ్చసర్కార్ కక్షసాధింపు

విజయవాడః
చంద్రబాబు సర్కార్ అంగన్ వాడీ కార్యకర్తలపై కక్షసాధింపుకు పాల్పడుతోంది.
ఈనెల 18న విజయవాడలో సీఎం క్యాంపు ఆఫీస్ ముట్టడికి యత్నించిన అంగన్ వాడీలను
ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.  వీడియో ద్వారా
గుర్తించి అంగన్ వాడీల  ఉద్యోగాలు తొలగించాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు
మెమో జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంపై అంగన్ వాడీలు భగ్గుమంటున్నారు. ఏఫ్రిల్ నుంచి వేతనాలు పెంచుతామని చెప్పి విధుల నుంచి తొలగించాలంటూ చంద్రబాబు ఆదేశాలివ్వడంపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబికుతున్నాయి.  


తమ ఉద్యోగాలు
తొలగించాలని చూస్తే ప్రభుత్వానికి తగిన శాస్తి తప్పదని అంగన్ వాడీలు హెచ్చరిస్తున్నారు.
చంద్రబాబు తన నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. లేనిపక్షంలో
పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇటీవలే ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడికి
ప్రయత్నించిన అంగన్ వాడీలను పోలీసులు దారుణంగా ఈడ్చుకెళ్లి వ్యాన్ లలో
కుక్కి అరెస్ట్ చేశారు. అర్థరాత్రి వరకు స్టేషన్ లోనే ఉంచారు. ప్రభుత్వ
తీరుపై ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. న్యాయపరమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు.
Back to Top