వాయిదాలతో పారిపోతున్న అధికారపక్షం

  • రూ. 3 వేల కోట్లు కేటాయించాల్సిన చేనేతలకు రూ. 140 కోట్లా.?
  • అప్పులబాధతో నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు
  • అన్ని రకాలుగా చేనేతలను బాబు మోసం చేశారు
  • వైయస్‌ఆర్‌ సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌
వెలగపూడి: ప్రజా సమస్యలపై ప్రతిపక్ష వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీలో చర్చిస్తే సమాధానం చెప్పలేక అధికార పక్షం వాయిదా వేసుకొని చర్చ నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్‌ అనిల్‌కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. చేనేత రంగ సమస్యలపై మాట్లాడేందుకు ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మైక్‌ ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడుతూ బీసీ సమస్యలపై చర్చిస్తున్న ప్రతిపక్ష సభ్యులకు రెండు నిమిషాలు ఎక్స్‌ట్రా టైమ్‌ ఇస్తే ఏమవుతోందని ప్రశ్నించారు. చేనేతరంగానికి సంవత్సరానికి రూ. వెయ్యి కోట్లు ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టి మూడు సంవత్సరాల కాలంలో రూ. 140 కోట్లు మాత్రమే ప్రభుత్వం కేటాయించిందని దుయ్యబట్టారు. చేనేతల రుణాలు మొత్తం మాఫీ చేస్తామని మ్యానిఫెస్టోలో పెట్టారని గుర్తు చేశారు. లక్షా 15 వేల మందికి దాదాపు రూ. 365 కోట్లు చెల్లించాల్సివుంటే కేవలం 25 వేల మందికి రూ. 110 కోట్లు చెల్లించి చంద్రబాబు చేతులు దులుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా రూ. 3 వేల కోట్లు కేటాయించివుంటే చేనేతల రుణమాఫీ ఏపాటిదో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. 

బీసీలకు పెద్ద పీట వేసే ప్రభుత్వం మాదే అని గొప్పలు చెప్పుకుంటూ చేనేత రంగాన్ని నిలువునా మోసం చేస్తున్నారన్నారు. విక్టోరియా మహారాణికి అగ్గిపెట్టేలో చీర బహుకరించిన మన ఏపీ చేనేత నైపుణ్యం... నేడు టీడీపీ హయాంలో ఆత్మహత్యలు చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు వచ్చినప్పుడు మగ్గం నేసుకోవడానికి షెడ్స్‌ నిర్మిస్తామన్నారు.. సబ్సీడీలు ఇస్తామన్నారు.. పెన్షన్లు ఇస్తామని అన్ని విధాలుగా చంద్రబాబు చేనేత సోదరులను మోసం చేశారని ధ్వజమెత్తారు. పవర్‌లూమ్‌ ఉత్పత్తుల వల్ల చేనేతలు అనేక రకాలుగా మోసపోతున్నారన్నారు. చట్టసభలో చేనేత సమస్యలపై మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. వాయిదా వేసే సమయంలో ప్రతిపక్ష నేత వైయస్‌ జగన్‌కు మాట్లాడే అవకాశం ఇస్తే చేనేతల సమస్యలు బయటకొచ్చేవన్నారు. ప్రభుత్వ బండారం బయటపడుతోందనే ప్రతిపక్ష నేతకు సమయం ఇవ్వలేదని ఫైరయ్యారు. 

తాజా వీడియోలు

Back to Top