ఓటమి భయంతోనే టీడీపీ అరాచకాలు..


వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి

అనంతపురంః ఓటమి భయంతోనే ప్రభాకర్‌ చౌదరి అరాచకాలు స్పష్టిస్తున్నారని వైయస్‌ఆర్‌సీపీ నేత అనంత వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి వర్గీయుల దౌర్జన్యాన్ని ఖండించారు. రావాలి జగన్‌..కావాలి జగన్‌ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు యత్నం చేసినా టీడీపీ నేతల కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనంతో వెయస్‌ఆర్‌సీపీ శ్రేణులు వ్యవహరించాయన్నారు. శారదానగర్‌లో వైయస్‌ఆర్‌సీపీ ప్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చింపివేయడం పట్ల మండిపడ్డారు. బహిరంగ చర్చకు రాకుండా ప్రభాకర్‌ చౌదరి,మేయర్‌ పారిపోయారని విమర్శించారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యక్రమాలను అడ్డుకుంటే ప్రజాగ్రహం తప్పదని హెచ్చరించారు.

తాజా వీడియోలు

Back to Top