వైయస్ఆర్‌సీపీలోకి టీడీపీ మాజీ ఎమ్మెల్యే గాంధీ

‌పలమనేరు (చిత్తూరు జిల్లా):

వేపంజేరి మాజీ ఎమ్మెల్యే ఆర్.గాంధీ వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ అ‌ధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ  సభ్యత్వం తీసుకున్నారు. గాంధీ గతంలో టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. పలమనేరు నియోజకవర్గంలోని పెద్దపంజాణి మండలం పెద్దవెలగటూరులో శ్రీ జగన్‌ను శనివారం ఉదయం ఆయన కలిశారు. శ్రీ జగన్మోహన్‌రెడ్డి గాంధీకి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. రాష్ట్ర సమైక్యత విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి విధానాలు నచ్చక తాను ఆ పార్టీని వీడినట్లు గాంధీ తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని దృఢ దీక్షతో పోరాడుతున్న శ్రీ వైయస్ జగ‌న్‌కు మద్దతు తెలిపేందుకే వైయస్ఆర్‌ కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు.

సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న శ్రీ జగన్మోహన్‌రెడ్డి వెంట ఓ సైనికుడిలా, పార్టీలో సామాన్య కార్యకర్తలా పనిచేస్తానని గాంధీ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పలమనేరు నియోజకవర్గ సమన్వయకర్త అమరనాథరెడ్డి, పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణస్వామి, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గం పరిశీలకుడు మిథున్‌రెడ్డి పాల్గొన్నారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top