టీడీపీ నియంత పోకడ

  • విజయవాడ కార్పొరేషన్‌ బడ్జెట్‌లో పన్నుల మోత l
  • తప్పుల తడక బడ్జెట్‌ను ఎత్తి చూపినందుకు వైయస్‌ఆర్‌సీపీ సభ్యుల సస్పెన్షన్‌
  • ఆందోళన చేపట్టిన వైయస్‌ఆర్‌సీపీ సభ్యులు
  • ఇది ప్రజా ఆమోద బడ్జెట్‌ కాదు
  • వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ పుణ్యశీల
విజయవాడ: అధికార తెలుగు దేశం పార్టీ నియంత పోకడలను అవలంభిస్తోంది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ..ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడం ఆనవాయిగా మారింది. దోచుకునేందుకు పద్ధతి, పాడు లేకుండా బడ్జెట్‌ రూపొందించుకోగా, వారి తప్పులు ఎత్తి చూపిన వైయస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లను నిర్ధాక్షిణంగా సభ నుంచి సస్పెండ్‌ చేసిన ఘటన శనివారం విజయవాడ కార్పొరేషన్‌లో చోటు చేసుకుంది. బడ్జెట్‌లో తప్పులు ఉన్నాయని, దేనికెంత నిధులు కేటాయించారని ప్రశ్నించిన వైయస్‌ఆర్‌సీపీ ప్లోర్‌ లీడర్‌ పుణ్యశీలపై టీడీపీ మహిళా సభ్యులను ఉసిగొలిపి, క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తూ, సభ నుంచి ప్రతిపక్ష సభ్యులను బయటకు పంపించి పన్నుల మోతతో రూపొందించిన బడ్జెట్‌ను ఆమోదించుకున్నారు. సభ నుంచి సస్పెండ్‌అయిన సభ్యులు కార్యాలయ ఆవరణలో ఆందోళన చేపట్టారు. ఇది ప్రజా ఆమోద యోగ్య బడ్జెట్‌ కాదని, మహిళలకు చట్ట సభల్లో రక్షణ, గౌరవం లేదని ప్రతిపక్ష సభ్యురాలు పుణ్యశీల మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు..

1981 నాటి నుంచి ఇప్పటి వరకు ఎంతో మంది మేయర్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే టీడీపీకి సంబంధించిన మేయర్, అధికార పార్టీ సభ్యులు ప్రజలను మోసం చేసే విధంగా బడ్జెట్‌ను రూపొందించారు. తప్పుల తడకగా, పన్నుల భారాల మోతగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. ఆ తప్పులను వేలెత్తి చూపించిన ప్రతిపక్ష పార్టీ సభ్యులను ఎదుర్కోలేక, కుట్ర రాజకీయాలు పన్నీ టీడీపీ మహిళా సభ్యులతో అనని మాటలు కూడా అన్నామని వక్రీకరించి సభాపూర్వకంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేస్తూ, లేని పక్షంలో సస్పెండ్‌ చేస్తామని బెదిరించి బయటకు పంపించారు. ఇది చాలా అన్యాయం. రికార్డులు ఒకసారి పరిశీలించండి, ఒకవేళ నేను తప్పుగా మాట్లాడి ఉంటే క్షమాపణ చెబుతాను. ఒక ప్రతిపక్ష నేతగా సభాపూర్వకంగా చెప్పినా..ఆ రికార్డులు వేయించను, నా మాటే వేదం, నేను చెప్పినట్లే చేయాలని, క్షమాపణ చెప్పు అనడం రాక్షసవైఖరికి పరాకాష్ట. ఇలాంటివి టీడీపీ ప్రభుత్వానికే చెల్లుతాయి. మహిళా పార్లమెంటు అంటూ గొప్ప గొప్పగా ఈవెంట్లు చేసుకోవడమే తప్పా..మహిళలను గౌరవించేది ఎక్కడా లేదు. ఇక్కడ మహిళలను మహిళలతోనే అగౌరవ పరుస్తున్నారు. నేను మహిళా ప్లోర్‌ లీడర్‌గా బడ్జెట్‌ గురించి ప్రసంగం మొదలుపెట్టినప్పుడు నా ప్రసంగానికి అడ్డుపడుతూ..వాళ్ల తప్పులను ఎక్కడ వేలెత్తి చూపుతానోనని ఒకరికి పది మంది లేచి ఇష్టారాజ్యంగా మాట్లాడింది కాకుండా టీడీపీ కార్పొరేటర్‌ కంచర్ల శేషారాణి లô చి ‘‘ ఏంటీ నీవు మేయర్‌కే ఎదురు సమాధానం చెబుతావు, ఓ తెగ ఇరుగబడి మాట్లాడుతున్నావ్‌’’ అంటూ ఏకవచన ప్రయోగంతో సభా సాక్షిగా, మీడియా ఎదుటే మాట్లాడితే ఆమెను సస్పెండ్‌ చేయకుండా కేవలం పక్షపాత వైఖరితో మమ్మల్ని సస్పెండ్‌ చేసి బడ్జెట్‌ ఆమోదించుకునేందుకు చూస్తున్నారు. నిజంగా ఈ బడ్జెట్‌ ప్రజా ఆమోదయోగ్యంగా ఎక్కడా లేదు. ఇందులో సంక్షేమ పథకాలకు ఎక్కడా తావు లేదు.  ఇతర పనులు, సీఎం క్యాంపు ఆఫీస్‌ డెవలప్‌మెంట్‌ అంటూ కోట్లకు కోట్లు ప్రతిపాదనలు రూపొందించారు. పద్ధతి, పాడు లేదు. బడ్జెట్‌ను ఆమోదించుకునేందుకు టీడీపీ పన్నిన కుట్ర. రాబోయే రోజుల్లో వీళ్లు చేస్తున్న ప్రతి పనికి ప్రజలు సరైన గుణపాఠం చెబుతారు.
Back to Top