నగరి) చిత్తూరు జిల్లా నగరి కేంద్రంగా పచ్చ చొక్కాలు చెలరేగిపోయాయి. వైఎస్సార్‌సీపీ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కేజే కుమార్ ను అప్రజాస్వామిక పద్దతిలో పోలీసుల చేత అరెస్టు చేయించారు. అదేమని ప్రశ్నించినందుకు మునిసిపల్ చైర్ పర్సన్ కేజే శాంతి మీద దౌర్జన్యం చేశారు. ప్రతిపక్ష నాయకుల్ని వేధించటమే లక్ష్యంగా జరుగుతున్న దాడులపై ప్రజాస్వామిక వాదులు మండిపడుతున్నారు.ఛైర్ పర్సన్ భర్త మీద దాడిమునిసిపల్ చైర్ పర్సన్ భర్త కేజే కుమార్ పార్టీ లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఆయన పార్టీ ట్రేడ్ యూనియన్ కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఆయన్ని ఇబ్బంది పెట్టేందుకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారు. దీని మీద స్వయంగా డీఎస్పీ విచారణ జరిపి ఆధారాలు లేకపోవటంతో అక్కడితే నిలిచిపోయారు. అకస్మాత్తుగా ఆదివారం ఉదయం పోలీసులు పెద్ద ఎత్తున విరుచుకు పడి, కేజే కుమార్ ను అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఇంటి వద్ద హంగామా సృష్టించారు. అదేమని ప్రశ్నించినందుకు మహిళ అని కూడా చూడకుండా ఆమె మీద దాడి చేశారు. ఆమె దుస్తులు చిరిగిపోయేలా వ్యవహరించారు. తెలుగుదేశం నాయకుల దగ్గర మార్కులు కొట్టేసేందుకు పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. అక్రమాల్ని ప్రశ్నించినందుకే దౌర్జన్యంనగరి మునిసిపల్ చైర్ పర్సన్ భర్త మీద దాడిని నగరి ఎమ్మెల్యే, మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా ఖండించారు. చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ప్రశ్నించినందుకే తమ మీద దాడులకు దిగుతున్నారని ఆమె ఆరోపించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. నగరి కమిషనర్ వైఖరి సక్రమంగా లేదని ఆమె మండిపడ్డారు. కేజే కుటుంబానికి పార్టీ వర్గాల భరోసా నగరి లో పోలీసుల దౌర్జన్యం గురించి తెలియగానే పార్టీ సీనియర్ నాయకులు స్పందించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నారాయణ స్వామి ఈ ఘటనపై మండి పడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కులాల చిచ్చు రాజేస్తోందని ఆయన అన్నారు.