వైయస్సార్సీపీ లో చేరిన టీడీపీ కార్యకర్తలు

విజయవాడ : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 53వ డివిజన్ టీడీపీ కార్యకర్తలు 60 మంది
ఇసుకపల్లి బాబూరావు, లింగంకుంట్ల
కాళీ నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌతంరెడ్డి
సమక్షంలో వైఎస్సార్ సీపీలోకి చేరారు. గౌతమ్ రెడ్డి వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
అనంతరం గౌతంరెడ్డి మాట్లాడుతూ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్ర బాబు విధానాలు, స్థానిక నాయకుల వ్యవహార శైలితో ఆపార్టీ కార్యకర్తలు విసిగి
పోయారనిఅభిప్రాయ
పడ్డారు. తమ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విధానాలతో ఆకర్షతులైన  వారు తమ పార్టీలోకి వస్తున్నారని, ఇది ప్రారంభం మాత్రమేని రానున్న రోజుల్లో రాష్ట్రంలో టీడీపీ
భూస్థాపితమవుతుందని జోస్యం చెప్పారు. 

 

Back to Top