బినామీల కోసమే స్విస్ ఛాలెంజ్

గుంటూరు: స్విస్ ఛాలెంజ్ విధానంపై  వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. స్విస్ ఛాలెంజ్ పద్ధతి మంచిదికాదని కేంద్రప్రభుత్వ నివేదికలే స్పష్టం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అయినా చంద్రబాబు తన బినామీ సంస్థలకు భూములు కట్టబెట్టడానికే  స్విస్ ఛాలెంజ్ విధానాన్ని అవలంభిస్తున్నారని విమర్శించారు. 

తాత్కాలిక సచివాలయంలో భూమి కుంగిన విషయాన్ని నిరూపిస్తామని.. మీడియా, అఖిలపక్షాన్ని వెలగపూడికి తీసుకెళ్లాలని ఆయన డిమాండ్ చేశారు. నిపుణులు వద్దని చెప్పినా వినకుండా  చంద్రబాబు  ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Back to Top