హైదరాబాద్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి శ్రీశైలం డ్యామ్ ను ఎండిపోయే స్థితికి తీసుకొచ్చారని వైఎస్ఆర్ సీపీ కర్నూలు ఎమ్ఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఆయనిక్కడ మంగళవారం మాట్లాడుతూ శ్రీశైలం రిజర్వాయర్ లో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందని, గత 10 ఏళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదన్నారు. చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కలిసి నీళ్లు ఎడాపెడా వాడుతున్నారని విమర్శించారు. రాయలసీమను ఎడారిగా చేసే కుట్ర జరుగుతోందన్నారు. ఎవరబ్బ సొత్తని నీళ్లు వాడుకుంటున్నారని ఆయన మండిపడ్డారు.<br/>ఇద్దరు సీఎంలు తక్షణమే స్పందించి రాయలసీమను ఆదుకోవాలని సూచించారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు, ఆ ప్రాంతానికే ఆన్యాయం చేస్తున్నారన్నారు. రాయలసీమతో నిధులతో మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులను రాయలసీమకే ఖర్చుపెట్టాలని ఏస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.<iframe width="700" height="400" src="https://www.youtube.com/embed/n82IKIn1-fo" frameborder="0"/>