విశాఖపట్నంః వైయస్ జగన్ పోరాటానికి ప్రజలు మద్దతుగా నిలిచారు. విశాఖలో ప్రజలు తమ ఇంటిపై కొవ్వొత్తులను వెలిగించి ప్రత్యేకహోదా ఆకాంక్షను తెలిపారు. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ , పార్టీ నేతలపై ఎయిర్ పోర్టులో పోలీసులు దురుసుగా ప్రవర్తించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ దుర్మార్గాలను నిరసిస్తూ ఎయిర్ పోర్టు బయట పార్టీ శ్రేణులు కొవ్వొత్తులు వెలిగించి ఆందోళన చేపట్టారు. రెండు గంటలుగా వైయస్ జగన్ ను పోలీసులు ఎయిర్ పోర్టులో నిర్బంధించారు. వైయస్ జగన్ ను బలవంతంగా లాక్కేందుకు యత్నిస్తున్నారు.