దళితులపై చిత్తశుద్ధి ఏది?

ఏపీ అసెంబ్లీ: ఈ ప్రభుత్వానికి దళితులపై చిత్తశుద్ధి లేదని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే సునీల్‌కుమార్‌ మండిపడ్డారు. ఏపీ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో 80 లక్షల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. ఐదు లక్షల మంది రుణాలకు అర్హులుగా ఉన్నారు. వీరికి దాదాపు రూ.50 వేల కోట్లు అవసరమవుతాయని చెప్పారు. అయితే ఈ ప్రభుత్వం రూ.5 కోట్లు కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం ఎస్సీ కార్పోరేషన్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. కొత్త రుణాలు రావాలంటే జన్మభూమి కమిటీలకు కమీషన్లు ఇచ్చుకోవాల్సిన దుస్థితి నెలకొనిందని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్‌ప్లాన్‌ కింద దళితుల గ్రామాల్లో సిమెంటు రోడ్డు వేస్తామంటున్నారు. సబ్‌ప్లాన్‌ కింద దళితులకు ఎందుకు రుణాలు ఇవ్వడం లేదని నిలదీశారు. మీరు రుణాలు మంజూరు చేసి ఉంటే దళితులు ఆర్థికాభివృద్ధి చేందే వారు అన్నారు. కొత్తగా డీకేటీ భూములను పంచిన ఆనవాలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎస్సీలుగా ఎవరైనా పుట్టాలా అనుకుంటారా అని  ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారంటే..ఆయనకు ఏమాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఈ మూడేళ్లలో రూ.1200 కోట్లు రుణాలు మరుగునపడ్డాయని తెలిపారు. ఇటీవల దళితులకు  250 ఇన్నోవా కార్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన చేసి హెటిరో కార్లు ఇచ్చారని విమర్శించారు.

Back to Top