సునీల కుటుంబానికి విజయమ్మ పరామర్శ

తెనాలి, 12 ఏప్రిల్ 2013:

గుంటూరు జిల్లా తెనాలి ఘటన చూస్తే మహిళలకు ఇంకా స్వాతంత్ర్య వచ్చినట్లు అనిపించదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. దుండగుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన సునీల కుటుంబ సభ్యులను శుక్రవారం సాయంత్రం ఆమె పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కోరారు. శాసనసభలో కూడా తాను ఆ కుటుంబం పక్షాన మాట్లాడతానని చెప్పారు. సునీల హంతకులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండు చేశారు. నిందితులు ఎంతటివారైనా వదలొద్దని కోరారు. నడిరోడ్లపై పెట్టిన మద్యం దుకాణాల కారణంగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. మహానేత మరణం తర్వాత ఎక్సయిజ్ ఆదాయం ఐదువేల కోట్లు పెరిగిదంటే మద్యం వినియోగం ఎంత పెరిగిదో అర్థమవుతుందన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధ్వానంగా ఉన్నాయని విజయమ్మ  పేర్కొన్నారు. చట్టాలున్నా పాలకులు సరిగా లేకుంటే ప్రయోజనమేమిటని ఆమె ప్రశ్నించారు.

తాజా ఫోటోలు

Back to Top