సుమన్ మృతికి వై‌యస్ఆర్సీపీ సంతాపం

హైదరాబా‌ద్‌, ‌7 సెప్టెంబర్‌ 2012: ఈనాడూ గ్రూపు సంస్థల అధిపతి సిహెచ్‌ రామోజీరావు కుమారుడు సుమన్ మృతిపట్ల వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రగాఢ సంతాపం తెలిపింది. రచయితగా, చిత్రకారుడిగా, నటుడిగా, ఈటీవీ డైరెక్టర్గా తెలుగు టీవీ ప్రేక్షకులకు సుమన్ సుపరిచితులని పార్టీ పేర్కొంది. చిన్నవయసులోనే సుమ‌న్ కన్నుమూయటం బాధాకరమని తెలిపింది. సుమ‌న్ సతీమణి విజయేశ్వరి, పిల్లలు, రామోజీరావు, కుటుంబ సభ్యులకు వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ ప్రగాఢ సానూభూతి వ్యక్తం చేసింది.

Back to Top