జగన్‌కు బాగా పడిపోయిన చెక్కెర స్థాయిలు

హైదరాబాద్, 29 ఆగస్టు 2013:

ఇరు ప్రాంతాలకూ సమన్యాయం చేయాలంటూ చంచల్‌గూడ జైలులోనే నిరవధిక నిరాహార చేస్తున్న వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత శ్రీ వైయస్‌ జగన్మోహన్‌రెడ్డిలో గురువారం ఉదయానికి చక్కెర స్థాయిలు బాగా పడిపోయాయి. బి.పి. స్థాయి కూడా బాగా తగ్గిందని, శ్రీ జగన్మోహన్ రెడ్డి రెండు కిలోల బరువు తగ్గారని సమాచారం. గురువారానికి ఐదవ రోజుకు శ్రీ జగన్‌ దీక్ష చేరింది. ఈ ఉదయానికి ఆయన దీక్ష చేపట్టి 100 గంటలు దాటింది. గురువారం ఉదయం శ్రీ జగన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించిన జైలు వైద్యులు ఆయన ఆహారం తీసుకోవాలని, లేకపోతే ఆరోగ్యం ప్రమాదకరంగా మారుతుందని తెలిపారు. వెంటనే దీక్ష విరమించాలి సూచించారు. అయితే, వైద్యుల సూచనను శ్రీ జగన్‌ సున్నితంగా తిరస్కరించారు.‌ శ్రీ ఆరోగ్యం క్షీణించిన పరిస్థితిపై జైలు అధికారులు తొలిసారిగా వివరాలు బయటికి వెల్లడించారు.

శ్రీ జగన్మోహన్‌రెడ్డి దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకూ మద్దతు వెల్లువెత్తుతున్నది. మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై ప్రజల్లో, అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లోనూ ఆందోళనా కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నది. శ్రీ జగన్‌ ఆరోగ్యం విషయంలో జైలు అధికారుల వ్యవహార శైలి కూడా పలు అనుమానాలకు తావిస్తోంది. శ్రీ జగన్ ఆరోగ్యానికి సంబం‌ధించిన వివరాలు మంగళవారం సాయత్రం హెల్తు బులెటిన్లో జైలు అధికారులు అందించారు. ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉందని నిన్నటి వరకూ అధికారులు చెప్పారు. కానీ నాలుగు రోజులుగా ఆహారం ముట్టుకోవపోవడంతో ఆయన బాగా నీరసించిపోయినట్టు సమాచారం.

శ్రీ జగన్‌కు అన్ని పరీక్షలూ జరిపించామని, ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని ఒకసారి, నీరసంగా ఉన్నారని మరోసారి... ఇలా జైలు అధికారులు రకరకాలుగా చెబుతున్న వైనం అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పైగా ఆయనకు జరిపిన పరీక్షల వివరాలను కూడా వెల్లడించకపోవడం, వారి వివరాలు రావాల్సి ఉందని, అప్పుడే ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి సమాచారం ఇవ్వగలమని చెబుతుండటం ఆందోళనను మరింతగా పెంచుతోంది.

మరోవైపు శ్రీ జగన్‌ నిరవధిక నిరాహార దీక్ష నేపథ్యంలో చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌ను, ఐజీని తాత్కాలిక డీజీ సాంబశివరావు మంగళవారం తన నివాసానికి పిలిపించుకున్నారు. పరిస్థితులను సమీక్షించడంతో పాటు దీక్ష, దాని పరిణామాలపై చాలాసేపు చర్చించారని తెలుస్తోంది. జైలు ఆసుపత్రిలో ఒక స్థాయి వరకే వైద్యం సాధ్యమన్న అంశం కూడా చర్చకు వచ్చిందని చెబుతున్నారు. దాంతో దీక్షను భగ్నం చేసే దిశగా పథక రచన జరుగుతోందన్న అనుమానాలు బాగా పెరుగుతున్నాయి.

తాజా వీడియోలు

Back to Top