రైతులను నట్టేట ముంచిన ఘనుడు చంద్రబాబు






- చెరకు రైతులకు మద్దతుగా వైయస్‌ఆర్‌సీపీ ధర్నా
– రైతుల ఆందోళనతో దిగివచ్చిన ప్రభుత్వం

చిత్తూరు: రైతులను నట్టేట ముంచిన ఘనుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. చిత్తూరు జిల్లా గాజుల మండ్యం చెరకు ఫ్యాక్టరీ రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల కోసం బుధవారం వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోజా, బియ్యం మధుసూదన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు.  రైతుల ధర్నాతో ప్రభుత్వం దిగి వచ్చింది. రైతులకు బకాయిలు చెల్లిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో మాత్రం రైతు కళ్లలో ఆనందం చూడటమే మా సర్కార్‌ లక్ష్యమని స్టేట్‌మెంట్లు ఇస్తున్నారన్నారు. వాస్తవానికి రైతులకు రుణమాఫీ చేస్తామని మాట తప్పారని, రైతుల పంటలకు గిట్టుబాటు ధర లేదని, బ్యాంకుల్లో రుణాలు అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. గతంలో కూడా చంద్రబాబు సంస్థ హెరిటేజ్‌ ప్రయోజనాల కోసం విజయా డయిరీని భూస్థాపితం చేశారన్నారు. అలాగే చిత్తూరు, వెంకటేశ్వర షుగర్‌ ఫ్యాక్టరీలను మూసివేయించారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వమే ఈ ఫ్యాక్టరీలను నడిపేలా చర్యలు తీసుకున్నారన్నారు. దురదృష్టవశాత్తు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో చెరుకు ఫ్యాక్టరీలు నష్టాల్లో నడుస్తున్నాయని మూత వేశారన్నారు. చిత్తూరు జిల్లాలో నాలుగు ప్రైవేట్‌ ఫ్యాక్టరీలకు రాని నష్టాలు ప్రభుత్వ సహకారంతో నడుపుతున్న పరిశ్రమలకు ఎందుకు వస్తున్నాయని రోజా ప్రశ్నించారు. వెంకటేశ్వర çషుగర్‌ ఫ్యాక్టరీకి చెందిన భూములను తనకు నచ్చిన వారికి దారదత్తం చేసేందుకు ఫ్యాక్టరీ మూసి వేశారన్నారు. ఎప్పుడు చూసినా స్పెషల్‌ ఫ్లైట్లలో తిరిగే చంద్రబాబు పరిశ్రమలు తెస్తానని గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. పరిశ్రమలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం అన్నారు.

 

తాజా వీడియోలు

Back to Top