ఆదినారాయణరెడ్డి స్వార్థపరుడు

–జమ్ములమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి
వైయస్‌ఆర్‌ జిల్లా: మంత్రి ఆదినారాయణరెడ్డి స్వార్థపరుడని, తన స్వలాభం కోసం, కుటుంబం అభివృద్ధి కోసమే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వీడి టీడీపీలో చేరారని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జమ్ములమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి విమర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో పాల్గొన్న సుధీర్‌రెడ్డి మీడియాతో గురువారం మీడియాతో మాట్లాడుతూ..2014 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డికి వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అవకాశం కల్పించి, ఆయన్ను గెలిపిస్తే నమ్మి మోసం చేశాడన్నారు. మేమంతా కూడా ఆదినారాయణరెడ్డి గెలుపునకు కృషి చేస్తే..మాకు ఒక్క మాట కూడా చెప్పకుండా టీడీపీలో చేరారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు మా ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఓట్లు వేయించుకున్నారన్నారు. అయితే ఇంతవరకు ఏ ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, రెండో ముఖ్యమంత్రిగా ఆదినారాయణరెడ్డి చెలామని అవుతూ అరాచకాలు చేస్తున్నారని విమర్శించారు. ఆర్‌టీపీపీ, వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి.  ఆయన బావ మరిది కేశవరెడ్డి కోసం, అన్నదమ్ముల అభివృద్ధి కోసం టీడీపీలో చేరారని వ్యాఖ్యానించారు. ఆయన లాభాల కోసం, అప్పులు పూడ్చుకునేందుకు ఆది పార్టీ మారాడని, ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని చెప్పారు. ఆదినారాయణరెడ్డికి దమ్ము, ధైర్యం ఉంటే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని, అప్పుడు ఆయన సంగతేంటో ప్రజలు తేలుస్తారన్నారు.  శిల్పా చక్రపాణిరెడ్డి కూడా రాజీనామా చేశాడని, ఆయన రాజీనామాను ఆమోదించిన ప్రభుత్వం ఆదినారాయణరెడ్డి రాజీనామాను ఎందుకు ఆమోదించలేదని సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే అభివృద్ధి సాధ్యమని సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో ప్రజా సంకల్ప యాత్రకు విశేష స్పందన వస్తోందని, ప్రజలు వైయస్‌ జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూ, సమస్యలు చెప్పుకుంటున్నారని సుధీర్‌రెడ్డి తెలిపారు.
 
Back to Top