చెట్ల కింద బోధనతో చదువు చతికిల




900ల మంది విద్యార్థులున్న పాఠశాలలో మౌలిక వసతులు కరువు
భవనం శిథిలావస్థకు చేరడంతో చెట్ల కింద పాఠ్యాంశాల బోధన
వైయస్‌ జగన్‌ను కలిసి సమస్యను వివరించిన మక్కువ జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులు
విజయనగరం: చెట్ల కింద బోధనతో చదువు చతికిలపడుతోందని సాలూరు నియోజకవర్గం మక్కువ నియోజకవర్గం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరులో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ను విద్యార్థులు కలిసి తమ సమస్యను వివరించారు. 900ల మంది విద్యార్థులున్న పాఠశాలలో కనీస సదుపాయాలు లేవని విన్నవించారు. తరగతి గదులు శిథిలావస్థకు చేరడంతో చెట్ట కింద చదువుకోవాల్సి వస్తుందని ఆందోళన చెందారు. స్కూల్‌ బిల్డింగ్‌ పాడైపోయిందని, తమ స్కూల్‌ సందర్శనకు వచ్చిన ప్రతి ఒక్కరికీ సమస్యను విన్నవించామని, అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. పాఠశాలలో ఎన్‌సీసీ లేదు, మంచినీటి సరఫరా లేదు. వర్షం వస్తే తరగతి గదుల పాడైపోవడంతో ఇంటికి పంపిస్తారని జననేతకు చెప్పారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించారని, వారానికి ఐదు కోడిగుడ్లతో కూడిన పౌష్టికాహారాన్ని అందించే వారిని చెప్పారు. కానీ ఇప్పుడు భోజనంలో నాసిరకమైన గుడ్లు పెడుతున్నారని, అవి చూడటానికే అసహ్యాంగా ఉన్నాయన్నారు. తమ సమస్యలను పరిష్కరించాలని విద్యార్థులు వైయస్‌ జగన్‌ను కోరారు. 
 

Back to Top