వెయ్యి మంది పిల్లలకు ఒకే ఒక టీచర్‌


తూర్పు గోదావరి: వెయ్యి మంది విద్యార్థులకు ఒకే ఒక టీచర్‌ ఉన్నారని డి.పోలవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు వైయస్‌ జగన్‌కు ఫిర్యాదు చేశారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లా  తుని నియోజకవర్గంలో పాదయాత్ర నిర్వహిస్తున్న వైయస్‌ జగన్‌ను డి.పోలవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు కలిశారు. స్కూల్‌లో తమకు సరైన సదుపాయాలు లేవని ప్రతిపక్ష నేతకు లేఖ ఇచ్చారు. వెయ్యి మంది విద్యార్థులు ఉన్నా..తమ సమస్యను పట్టించుకునే నాథుడు లేడని వాపోయారు. స్కూల్‌లో ప్లే గ్రౌండ్‌ లేదని, పీఈటీ ఉన్నా ఆటలు లేవని చెప్పారు. ఇరుకు గదుల్లో క్లాస్‌లు నిర్వహిస్తున్నారని తెలిపారు.  తెలుగు, హిందీ టీచర్లు లేరని ఫిర్యాదు చేశారు. ప్రతి ఏటా తమ స్కూల్‌ విద్యార్థులకు త్రిపుల్‌ ఐటీ సీట్లు వస్తున్నాయని, అయినా మా స్కూల్‌ను ఎవరు గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపకార వేతనాలు అందడం లేదని జననేత దృష్టికి తీసుకెళ్లారు.  విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న వైయస్‌ జగన్‌ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. 

 
Back to Top