సెల్ఫీ ఆనందం

 

అనంత‌పురం: త‌మ అభిమాన నాయ‌కులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జిల్లాకు రావ‌డంతో యువ‌త ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా జ‌న‌నేత‌ను క‌లిసేందుకు పోటీ ప‌డుతున్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, మ‌హిళ‌లు, రైతులు వైయ‌స్ జ‌గ‌న్‌తో క‌ర‌చాల‌నం చేసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు ఆస‌క్తి క‌న‌బ‌రుస్తున్నారు. జగనన్నతో ఆటోగ్రాఫ్‌ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంద‌ని  అనంతపురం మారుతీనగర్‌కు చెందిన లావణ్య, గాయత్రి తమ ఆనందాన్ని  పంచుకున్నారు. బుధవారం ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అనంతపురం రుద్రంపేట సమీపంలో నడిచి వెళ్తుండగా దారి వెంట ఆయనతో సెల్ఫీలు, ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు పోటీపడ్డారు. అందులో భాగంగానే అనంతపురంలోని అమెరికన్‌ స్కూల్‌ ఆఫ్‌ నర్సింగ్‌ విద్యార్థినులు లావణ్య, గాయత్రి కూడా వైయ‌స్ జగన్‌ ఆటోగ్రాఫ్‌ తీసుకున్నారు.

Back to Top