వైయస్సార్‌సీపీని బలోపేతం చేయండి

మడకశిర రూరల్‌: నగర పంచాయతీ పరిధిలోని వార్డుల్లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలు, మోసపూరిత హామీలు తదితర వాటిని ప్రజలకు తెలియజేస్తూ వార్డుల్లో వైయస్సార్‌సీపీని బలోపేతం చేయాలని పట్టణ కన్వీనర్‌ బీఎల్‌ రామకృష్ణ తెలియజేశారు. శనివారం మాళేరొప్పం గ్రామంలో వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు సమావేశమై బూత్‌ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా కన్వీనర్‌ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలను కష్టాలకు గురి చేస్తున్న ప్రభుత్వానికి రాబోవు రోజుల్లో బుద్ధి చెప్పాలన్నారు. బూత్‌ కమిటీల ద్వారా పార్టీని మరింత బలోపేతం చేయాలన్నారు. కమిటీ కన్వీనర్‌గా మారుతి, ఉపాధ్యక్షుడిగా నాగేంద్రతోపాటు 10మంది సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గోవిందరాజు, మల్లేగౌడ్, హనుమంతరాయ, ఈరప్పరెడ్డి, కరియన్న, రంగనాథ్, రామన్న, డీఆర్‌‡ రంగనాథ్, జగన్నాథ్, విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఫోటోలు

Back to Top