స్థానిక ఎన్నికలకు హైకోర్టు ఆదేశం

హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదిగో ....ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్న ప్రభుత్వానికి న్యాయస్థానం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మంగళవారం ఆదేశించింది. మూడు నెలల్లోగా ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ, గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఏర్పాట్లు తక్షణమే చేయాలని సూచించింది. ఏడాదికి పైగా స్థానిక సంస్థలు ప్రత్యేకాధికారుల పాలనలోనే ఉన్నాయి. తాజా గణాంకాలు అందుబాటులో లేకున్నా సరే, 2001 జనాభా లెక్కల ప్రకారం ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. 

Back to Top