రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్ వ‌ర్ధంతి కార్యక్రమాలు

హైదరాబాద్, 2 సెప్టెంబర్ 2013 :

మహానేత డాక్టర్ వై‌యస్ రాజశేఖరరెడ్డి నాలుగ‌వ వర్ధంతి సందర్భంగా వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.‌ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి నాలుగేళ్ళు అయినా నిష్కల్మషమైన నవ్వుతో ఉండే ఆయన ముఖం జనం మనోఫలకాలపై చెక్కుచెదరకుండా ఉంది. అందుకే భౌతికంగా ఈ లోకం నుంచి ఆ మహానేత నిష్ర్కమించినా కోట్లాది హృదయాల్లో దైవసమానునిగా కొలువుదీరి ఉన్నారు.

రాష్ట్రమంతటా మహానేత వైయస్ఆర్  వ‌ర్ధంతిని పార్టీ శ్రేణులు నిర్వహిస్తున్నాయి. వైయస్ఆర్‌ అంటే అభిమానం ఉన్న వివిధ వర్గాల ప్రజలు కూడా అనేక స్వచ్ఛంద కార్యక్రమాలకు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో వైయస్ఆర్ విగ్రహాలకు నివాళులు అర్పించడంతో పాటు అన్న,‌ వస్త్ర, రక్తదానాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. వైయస్ఆర్ పథకాలతో లబ్ధి పొందినవారంతా ఆయన లేని లోటును జ్ఞప్తికి తెచ్చుకుంటూ అనేక చోట్ల ఆ మహానేత చిత్రపటాలు పెట్టుకుని కార్యక్రమాలు చేస్తున్నారు.

తాజా వీడియోలు

Back to Top