ఏపీ : ప్రత్యేకహోదా విషయంలో టీడీపీ, బీజేపీల మోసపూరిత వైఖరికి నిరసనగా వైయస్సార్సీపీ తలపెట్టిన బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ బంద్కు టీడీపీ, బీజేపీలు మినహా అన్ని రాజకీయ పక్షాలు, పలు సంఘాల నాయకులు, సంస్థలు మద్దతు తెలిపాయి. ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు చేపట్టారు. బంద్ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న పరిస్థితుల వివరాలు ఇలా ఉన్నాయి....
గుంటూరు జిల్లా :మంగళగిరిలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద బంద్ పాటిస్తున్న స్థానిక ఎమ్మెల్యే ఆర్కేతోపాటు తొమ్మిది మంది పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. బంద్ కు సహకరించాలని కోరుతూ పట్టణంలో స్థానిక యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. సత్తెనపల్లిలో నిరసన తెలుపుతున్న వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతోపాటు 20 మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరు బస్టాండ్ వద్ద ఎమ్మెల్యే ముస్తఫా, లేళ్ల అప్పిరెడ్డి, మేరుగ నాగార్జున ఆందోళనకు దిగగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. రేపల్లెలో బంద్ పాటిస్తున్న పార్టీ పట్టణ కన్వీనర్ గడ్డం రాధాకృష్ణమూర్తి, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రశాంత్‌కుమార్, మైనారిటీ నేత షేక్ సుభానీతో పాటు 25 మందిని పోలీసులు అరెస్టు చేశారు.

వైయస్సార్ జిల్లా :కడప ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే అంజాద్ బాషా, మేయర్ సురేష్ బాబుతోపాటు కడప నగర అధ్యక్షుడు నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. డిపోలోని రెండు గేట్లను మూసివేసి... బస్సులను నిలిపివేశారు. పులివెందుల బస్టాండ్లో ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. బస్సులను పార్టీ శ్రేణులు నిలిపివేశారు. ఈ ధర్నాలో దేవిరెడ్డి శంకర్రెడ్డి పాల్గొన్నారు. రైల్వేకోడూరు మండలం కుక్కల్దొడ్డి వద్ద ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. చెన్నై - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. బద్వేల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. అలాగే స్థానిక బస్టాండ్ వద్ద ప్రజాసంఘాలు ధర్న నిర్వహించాయి. రాయచోటి బంద్‌లో ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు. స్థానిక నేతలతో కలిసి ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా చేపట్టారు. జమ్మలమడుగులో బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. వాణిజ్య, వ్యాపార సంస్థల వారు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొంటున్నారు. బస్సులు నడవటం లేదు.
చిత్తూరు జిల్లా :ప్రత్యేక హోదా కోసం బంద్ చేస్తున్న చిత్తూరు జిల్లా అధ్యక్షులు నారాయణస్వామి, యస్ కె బాబు, సుదర్శన్ రెడ్డి, ఇమాం ,హరిప్రసాద్ లను పోలీసులు అరెస్ట్ చేసి రేణుగుంట పోలీసు స్టేషన్ తలించారు. నారాయణవనంలో హైవేపై వైయస్సార్సీపీ సత్యవీడు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆదిమూలం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో చేపట్టారు. పలమనేరు నియోజకవర్గంలో వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో స్వచ్ఛంధంగా బంద్ కొనసాగుతోంది. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టగా పోలీసులు అరెస్ట్ చేశారు. బంగారుపాలెంలో ఎమ్మెల్యే సునీల్ ఆధ్వర్యంలో ధర్నా... ఎమ్మెల్యే సహా 200 మంది అరెస్ట్. శ్రీకాళహస్తిలో వైయస్సార్‌సీపీ నేత మదుమోహన్ ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు.
అనంతపురం జిల్లా :అనంతపురంలో ఆందోళన చేస్తున్న మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్రెడ్డితో సహా పలువురు నేతలను అదుపులోకి తీసుకుని.. పోలీస్ స్టేషన్కు తరలించారు. కదిరిలో సిద్దారెడ్డి ఆధ్వర్యంలో బంద్ కొనసాగుతోంది. ధర్మవరం, గుంతకల్లులో వైయస్సార్ సీపీ సమన్వయ కర్త వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సుమారు 150 మంది అరెస్ట్... డిపోలకు పరిమితమైన 1000 బస్సులు. పుట్టపర్తి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ పుట్టపర్తిలో బంద్ చేపట్టారు.

ప్రకాశం జిల్లా:గిద్దలూరులో ఆర్టీసీ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా నేతలు అడ్డుకున్నారు. సుమారు 12మంది నేతలను పోలీసులు స్టేషన్‌కు తరలించారు.

కృష్ణాజిల్లా :విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బస్సులు తిరగకుండా అడ్డుకున్నారు. కృష్ణా జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి పార్థసారధి, వంగవీటి రాధ, పి.గౌతంరెడ్డి, నాగిరెడ్డి... ఆర్టీసీ ప్రయాణికులు, పోలీసులు, ఆర్టీసీ సిబ్బందికి గులాబీలు ఇచ్చి బంద్‌కు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ బస్సుల్లో వీరి ప్రచారానికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా పార్థసారథితోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. నూజివీడులో ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో ఆర్టీసీ డిపో ఎదుట నాయకులు బైటాయించారు. దీంతో బస్సులు బయటకు రాలేదు. బంద్‌కు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి.
పశ్చిమగోదావరి జిల్లా :కొవ్వూరు ఆర్టీసీ డిపో ముట్టడించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తానేటి వనిత, వందలాది మంది కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా :రావులపాలెం ఆర్టీసీ డిపో వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి సహా నాయకులు ధర్నాకు దిగారు. బస్సులు బయటకు రాకుండా ఆందోళన చేస్తున్నారు. రంపచోడవరంలో వైయస్సార్సీపీ నేతల ఆందోళన... పాల్గొన్న ఎమ్మెల్యే వంతుల రాజేశ్వరి, ఉదయభాస్కర్. ముమ్మిడివరంలో పితాని బాలకృష్ణ, గుత్తుల సాయి ఆధ్వర్యంలో బంద్.
రామచంద్రాపురంలో ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్ర ఆధ్వర్యంలో బంద్, ధర్నా

విశాఖపట్నం జిల్లా :మద్దిలపాలెంలో ఆర్టీసీ డిపో వద్ద ఆందోళన చేస్తున్న గుడివాడ అమర్నాథ్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. బంద్‌కు సహకరించాలని కోరుతూ తాటిచెట్లపాలెంలో వైయస్సార్సీపీ నేతలు బైక్ ర్యాలీ చేపట్టారు. చోడవరంలో ధర్మశ్రీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్. అనకాపల్లిలో జానకీరామరాజు ఆధ్వర్యంలో బంద్. వైయస్సార్ సీపీ పాడేరు మ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్... జిల్లా వ్యాప్తంగా 850 బస్సుల నిలిపివేత.
విజయనగరం జిల్లా :విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆందోళన చేస్తున్న పార్టీ ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ వీరభద్రస్వామిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి ఆధ్వర్యంలో కురుపాంలో ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ బంద్ చేపట్టారు.
శ్రీకాకుళం జిల్లా :పాతపట్నంలో వైయస్సార్సీపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా పార్టీ నాయకుడు తమ్మినేని సీతారంతోపాటు పలువురు పార్టీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి ఆధ్వర్యంలో ధర్నా... ఎమ్మెల్యే సహా పలువురు కార్యకర్తల అరెస్ట్. ఇచ్చాపురంలో మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ ఆధ్వర్యంలో బంద్ పాటిస్తున్న వ్యాపార సంస్థలు... జిల్లా వ్యాప్తంగా వెయ్యిమందికి పైగా వైయస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల అరెస్ట్... నిలిచిపోయిన 1050 బస్సులు
నెల్లూరు జిల్లా...నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో, సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య ఆధ్వర్యలో ధర్నా చేపట్టారు. జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి ఆధ్వర్యంలో వైయస్సార్సీపీ నాయకులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో, 700 బస్సులు నిలిచిపోయాయి. గూడురులో మెరుగ మురళీధర్, గోపాల్‌రెడ్డిల ఆధ్వర్యంలో శాంతియుతంగా ధర్నా నిర్వహించారు.

కర్నూలు...ఆదోని ఎమ్మెల్యే సాయిపత్రాప్ రెడ్డి ఆధ్వర్యంలో కొనసాగుతున్న బంద్... స్వచ్ఛంధంగా పలు వ్యాపార, వాణిజ్య సముదాయల బంద్. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య ఆధ్వర్యంలో, ప్రత్తికొండలో వైయస్సార్ సీపీ నేత చెరుకుపాటి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.