వైయస్ జగన్ తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం

క‌ర్నూలు:  వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎం అయితే రాష్ట్ర క‌ష్టాల‌న్ని తీరుతాయ‌ని తిరుప‌తి ఎంపీ వ‌ర‌ప్ర‌సాద‌రావు అభిప్రాయపడ్డారు. తెలంగాణ అక్రమ ప్రాజెక్టుల‌కు నిర‌స‌న‌గా వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి చేప‌ట్టిన దీక్ష‌కు ఆయ‌న సంఘీభావం తెలిపారు. ఏ రాష్ట్రంలో జ‌ర‌గ‌ని అన్యాయాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జ‌రుగుతున్నాయ‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం చేత‌గానీ చంద్ర‌బాబుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కొనుగోలు చేయ‌డానికి చేత‌నైతుందా..? అని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు. చంద్ర‌బాబు చేస్తున్న అవినీతి పాల‌న‌, అన్యాయాల‌పై ప్ర‌జ‌లు ఆలోచన చేయాలన్నారు.  2019 ఎన్నిక‌ల్లో వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సీఎం కావ‌డం త‌ధ్య‌మ‌న్నారు. వైయ‌స్ జ‌గ‌న్ వ‌స్తేనే రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పారు.

Back to Top