() రాజధానిలో అడ్డగోలుగా భూ దందా() అక్రమాల్ని వెలుగులోకి తెచ్చిన సాక్షి() పోలీసు కేసులతో వేధించేందుకు టీడీపీ కుట్రలు

హైదరాబాద్: రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతల భూ దందా మీద సీబీఐతో విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ సీనియర్ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కోరారు. బెదిరింపులు మాని టీడీపీ నేతలు విచారణకు సిద్దపడాలని ఆయన హితవు పలికారు. ఏపీ రాజధాని ప్రాంతంలో అధికార టీడీపీ నేతల భూ అక్రమాలను 'సాక్షి' ఆధారాలతో వెలుగులోకి తెచ్చిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాజధాని విషయంలో ముందే లీకులిచ్చి టీడీపీ నేతలు భూములు కొనేలా చేశారని, అదే విషయాన్ని 'సాక్షి' వెలుగులోకి తెచ్చిందని చెప్పారు.

ఏపీ రాజధాని ప్రకటనకు ముందే టీడీపీ నేతలు భూములు కొన్నారని, వీటిని ల్యాండ్ పూలింగ్ లోకి రాకుండా చూసుకున్నారని ఆరోపించారు. రాజధానికి తాము వ్యతిరేకం కాదని, చంద్రబాబు భూసేకరణకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలని తాము కోరుకుంటున్నామని చెప్పారు.
పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలు వెలుగులోకి తెస్తే ప్రాసిక్యూట్ చేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులతో కేసులు పెట్టించి వేధిస్తారా అని నిలదీశారు. తప్పు చేయకుంటే చంద్రబాబు విచారణకు ఎందుకు సిద్ధపడడం లేదని అడిగారు.