వైయ‌స్‌ జగన్‌ను కలిసిన ఎంపీటీసీ స‌భ్యురాలు

వైయ‌స్ఆర్ జిల్లా:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఒంటిమిట్ట మండలం గంగపేరూరు ఎంపీటీసీ దొడ్డిపల్లి శ్రీదేవి కలిశారు. సుమారు వారం రోజులుగా అదృశ్యమైన ఆమె పార్టీ అధినేత‌ను క‌లిసి టీడీపీ నేత‌ల తీరును వివ‌రించారు. అధికార పార్టీ ఆగడాలతోపాటు....క్యాబినెట్‌ ర్యాంకు హోదా కలిగిన నేత ఇబ్బందులకు గురి చేస్తూ తీవ్రమైన భయాందోళనలకు గురి చేస్తున్న నేపధ్యంలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు ఆమె వైయ‌స్‌ జగన్‌కు తెలియజేశారు. తన మాట వినకపోతే కేసులు పెడతామని హెచ్చరించారని జగన్‌కు తెలియజేశారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి వైయ‌స్‌ వివేకానందరెడ్డి గెలుపుకు కృషి చేయనున్నట్లు ఆమె తెలిపారు.  ఎలాంటి ఆందోళనలు చెందవద్దని....ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌ శ్రీదేవికి భరోసా ఇచ్చారు. 

Back to Top