నర్సాపురంలో నేడు 'వైయస్‌ఆర్ జ‌నభేరి'

నర్సాపురం (ప.గో.జిల్లా) :

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అ‌ధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి శుక్రవారంనాడు పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.‌ నర్సాపురంలోని స్టీమర్‌ రోడ్డులో ఈ రోజు సాయంత్రం ఆయన వైయస్ఆర్‌ జనభేరి ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. హైదరాబాద్ నుంచి విమానంలో‌ మధ్యాహ్నం ఒంటి గంటకు గన్నవరం వచ్చిన శ్రీ జగన్ అక్కడి‌ నుంచి రోడ్డు మార్గంలో ఆయన నరసాపురం బయలుదేరి వెళ్ళారు.

నర్సాపురానికి బయలుదేరి వెళ్ళే ముందు గన్నవరం రోటరీ క్లబ్‌లో జరిగిన కార్యక్రమంలో శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి సమక్షంలో కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి శ్రీ జగన్‌ పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానించారు.

నర్సాపురంలో వైయస్ఆర్ జనభేరి కార్యక్రమం సందర్భంగా‌ శ్రీ జగన్మోహన్‌రెడ్డి సమక్షంలో నరసాపురం కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీలో చేర‌తారు. ఆయనతో పాటు మరికొందరు నాయకులు కూడా పార్టీలో చేరనున్నట్లు సమాచారం.

Back to Top